డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 23(నమస్తే న్యూస్).
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకంపాడ్ గ్రామ సర్పంచ్ ఉప్పల సొమ్మన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాలోత్ నెహ్రూ నాయక్ పరామర్శించాడు.కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపాడు.కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని ఆర్థిక సాయం అందించాడు.సొమ్మన పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేకంగా ఆరా తీశాడు.వారి చదువు,భవిష్యత్తుకు అవసరమైన సహాయాన్ని తన వంతుగా అందిస్తానని హామీ ఇచ్చాడు.ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,సొమన్న కుటుంబానికి ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని నెహ్రూ నాయక్ తెలిపాడు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు,గ్రామస్థులు,అభిమానులు పాల్గొన్నారు.

