టిఎస్ సిపిఎస్ఇయు మరిపెడ మండల శాఖ.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 23(నమస్తే న్యూస్).
కొత్త పెన్షన్ పథకాన్ని రద్దు చేసి ఉద్యోగులు,ఉపాధ్యాయులకు సామాజిక భద్రత కల్పించే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ రోజు జరుగుతున్న సిపిఎస్ రద్దు – పాత పెన్షన్ అమలు మహాసభ*కు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన ఉద్యోగులు,ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
ఈ సందర్భంగా టిఎస్ సిపిఎస్ఇయు మరిపెడ మండల శాఖ నాయకులు మాట్లాడుతూ,చందా పెన్షన్ విధానం ఉద్యోగుల భవిష్యత్తుకు తీవ్ర అనిశ్చితిని కలిగిస్తోందని,ఉద్యోగ విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవనానికి భరోసా ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చందా పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తెస్తామని ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చి రాష్ట్రంలోని చందా పెన్షన్ ఉద్యోగులు,ఉపాధ్యాయుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలని కోరారు.
ఉద్యోగుల భవిష్యత్ భద్రత పాత పెన్షన్ తోనే సాధ్యం,సిపిఎస్ రద్దు – పాత పెన్షన్ అమలు అనే నినాదాలతో మరిపెడ నుంచి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వరకు ఉద్యోగ,ఉపాధ్యాయుల ఐక్య గళం మార్మోగింది.పాత పెన్షన్ విధానం సాధించే వరకు ఉద్యోగులు,ఉపాధ్యాయుల ఐక్య ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని కొనసాగిస్తామని టిఎస్ సిపిఎస్ఇయు మరిపెడ మండల శాఖ నాయకులు తెలిపారు.
టిఎస్ సిపిఎస్ఇయు – మరిపెడ మండల శాఖ.

