తొర్రూర్, ప్రతినిధి ఆగస్టు 23 (నమస్తే న్యూస్)
తొర్రూరు మండలంలోని గుర్తురు గ్రామానికి చెందిన బిజెపి నాయకులు దేవరకొండవిష్ణు వర్ధన్ చారి నీ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గా నియమించి నట్లు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఓబీసీ జిల్లా నూతన ఉపాధ్యక్షులు దేవరకొండ విష్ణువర్ధన్ చారి మాట్లాడుతూ బిజెపి పార్టీ కోసం తాను చేస్తున్న సేవలను గుర్తించి జిల్లా పదవి అప్పగించడం చాలా ఆనందంగా ఉందన్నారు తనకు ఈ పదవి రావడానికి కృషిచేసిన బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ కు రాష్ట్ర నాయకులు పాలకుర్తి ఇంచార్జ్ లేగారామ్మోహన్ రెడ్డి ఓబీసీ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవి ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలుపుల శంకర్ జనగామ జిల్లా ఉపాధ్యక్షులు రంగు రాములు గౌడ్ పల్లె కుమార్ తొర్రూర్ రూరల్ అధ్యక్షులు గట్టు రాంబాబు అర్బన్ అధ్యక్షులు పైండ్ల రాజేష్ మరియు బిజెపి జిల్లా మండల గ్రామ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు తనకు అప్పగించిన పదవిని వమ్ము చేయకుండా బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

