అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై ఉల్లి శ్రీనివాస్ పార్టీలో చేరిక.
ప్రజా సంక్షేమమే బీజేపీ లక్ష్యం…మాజీ ఎంపీ సీతారాం నాయక్.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 22(నమస్తే న్యూస్).
బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు,పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ అన్నారు.
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఉల్లి శ్రీనివాసరావు ఆయన సమక్షంలో బీజేపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.అనంతరం సీతారాం నాయక్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దీనస్థితిలో ఉందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి,తిట్ల దండకంతో ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.తెలంగాణలో త్వరలోనే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కావడం ఖాయమని,మరోసారి ఢిల్లీ పీఠాన్ని బీజేపీయే కైవసం చేసుకుంటుందని,వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పడడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ అధ్యక్షురాలు భూక్యా లింగం మంగమ్మ,అధ్యక్షుడు గంగాధర్,బీజేపీ నాయకులు చీకటి మహేష్ గౌడ్,పులి శ్రీనివాస్,నాగరాజు,భూక్యా కాంతమ్మ, జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

