రాపోలు నిర్మలానరసింహ నేత
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి
రామన్నపేట ఆగస్ట్ 22(నమస్తే న్యూస్)
22-ఏ నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు కూడా చేర్చడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఒక సర్వే నంబర్లో కొంత మేరకు మాత్రమే నిషేధిత భూమి ఉన్నప్పటికీ, మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఆ భూమిలో ఎలాంటి వివాదం లేని యజమానులు కూడా రిజిస్ట్రేషన్, అమ్మకం, కొనుగోలు, బ్యాంకు రుణాలు వంటి అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు,తమ సొంత భూమిపై హక్కు ఉన్నప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం ఆందోళన కలిగించే విషయం,రెవెన్యూ వ్యవస్థలో గ్రామస్థాయి నుంచి భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిషేధిత భూమి ఎంత మేరకు ఉందో స్పష్టంగా గుర్తించే పటిష్టమైన వ్యవస్థ అవసరం,కొంత భాగం మాత్రమే నిషేధిత జాబితాకు సంబంధించినదైతే, మొత్తం సర్వే నంబర్‌ను కాకుండా సంబంధిత భూమిని మాత్రమే నిషేధిత జాబితాలో నమోదు చేసే విధంగా రికార్డులను శాస్త్రీయంగా సరిచేయాలి, పాత రికార్డులు, ప్రస్తుత భూ పరిస్థితులు, హక్కు పత్రాలు, క్షేత్రస్థాయి వాస్తవాలను సమగ్రంగా పరిశీలించి తప్పులుంటే వాటిని సులభమైన విధానంలో సరిచేసే అవకాశం కల్పించాలి,ప్రభుత్వం ఈ సమస్యను అత్యంత సున్నితమైన ప్రజా సమస్యగా పరిగణించి లోతైన సమీక్ష చేపట్టాలి,నిర్దోషులైన భూ యజమానులను భయభ్రాంతులకు గురిచేయకుండా, వారి విలువైన సమయాన్ని వృథా చేయకుండా, ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా గ్రామస్థాయిలోనే సమస్యలను గుర్తించి పరిష్కరించే విధానం తీసుకురావాలి, భూ హక్కుల విషయంలో పారదర్శకత, న్యాయం, ప్రజలకు సులభమైన సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకుని 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న తప్పులను సరిచేసి బాధిత భూ యజమానులకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

