రామన్నపేట,ఆగస్ట్ 22 (నమస్తే న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో,ప్రజా ఉద్యమాల కోసం జీవితమంతా పోరాడిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి, ప్రధమ వర్ధంతి సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలో సుభాష్ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు,సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ మాట్లాడుతూ ఉమ్మడి మహబబ్ నగర్ జిల్లాలో జన్మించి సురవరం సుధాకర్ రెడ్డి నల్లగొండ జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది అని అన్నారు నల్లగొండ గడ్డపై వామపక్ష ఉద్యమాల కు నాయకత్వం వహించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని తెలిపారు నల్లగొండ లోక్ సభ స్థానం నుండి పార్లమెంటు సభ్యునిగా రెండుసార్లు ఎన్నికై ప్రజలకు విశిష్ట సేవలు అందించారు అని పేర్కొన్నారు ముఖ్యంగా సాగు నీరు ప్రాజెక్టులను ఎస్ ఎల్ బి సి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ డిండి ఎత్తిపోతల పథకం తదితర అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు రైతులకు ప్రజల ప్రయోజనాల కోసం అలుపెరుగని పోరాటం కొనసాగించాడని కొని ఆడాడుసిపిఐ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సురవరం సుధాకర్ రెడ్డి,ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల పక్షాన నిలిచిన ఉద్యమ నాయకుడు అని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయడమే నిజమైన నివాళులు అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, పట్టణ కార్యదర్శి రచ్చయాదగిరి, ఏఐటీయూసీ,మండల కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య, సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య, ఊట్కూరి భగవంతం, వీరమల్ల వెంకటయ్య, గంగాపురం యాదయ్య, గంగాపురం వెంకటయ్య, పర్స సుదర్శన్, కళ్లం యాదయ్య,ఊట్కూరి కృష్ణ, వీసం గాలయ ,పల్లె మల్లేశం, సిహెచ్ మల్లేశం, రచ్చ దయాకర్, గంజి అశోక్ ,తదితరులు పాల్గొన్నారు.

