
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 22(నమస్తే న్యూస్).
డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలం వెంకంపాడు గ్రామ సర్పంచ్ ఉప్పల సోమన్న ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం వెంకంపాడు గ్రామానికి చేరుకున్నారు.సోమన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం సోమన్న కుటుంబ సభ్యులను పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి,ఈ విషాద సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ యువ నాయకులు గుగులోత్ శ్రీరామ్ నాయక్,మాజీ సర్పంచ్ వనజా శ్రీరామ్,కొంపల్లి వేణుగోపాల్ రెడ్డి,పెదబోయిన రంగన్న,రామగాని లింగమూర్తి,మాజీ సర్పంచ్ రాజు నాయక్,గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు రమేష్,దండ రాములు,బుర్ర అవిలయ్య,లక్ పతి తదితరులు పాల్గొన్నారు…


