రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్ | సెంటర్: బయ్యారం
బయ్యారం, ఆగస్టు 22 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని వెంకట్రాంపురం రోడ్డు చర్చి వద్ద హోసన్న ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రభాకర్ కుమార్తె జ్ఞాపకార్థం పేదలు, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి బయ్యారం గ్రామ సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్, ఉపసర్పంచ్ ఎనుగుల ఉమా రంజిత్‌లను నిర్వాహకులు శాలువాలతో సన్మానించారు. అనంతరం సర్పంచ్ చేతుల మీదుగా 30 మందికిపైగా వృద్ధులు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
హామీ మేరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు
ఈ సందర్భంగా బిషప్ ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించిన సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో బయ్యారం ఉపసర్పంచ్ ఎనుగుల ఉమా రంజిత్, మాజీ ఎంపీపీ గుగులోత్ కిషన్ నాయక్, మాజీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిని వెంకటేశ్వరరావు, తాటి జనార్దన్, పులి మల్లయ్య, నందిపాటి భవాణి, ఆకునూరి సూర్యనారాయణ, రామగిరి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తుపాకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

