నియామకానికి సహకరించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు కృతజ్ఞతలు
రామన్నపేట, ఆగస్టు 21 (నమస్తే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది గంపల జీవన్‌రెడ్డి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. జిల్లా అధికారుల చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించిన ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న జగన్మోహన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గంగుల రాజిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకులకు, తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బోగారం గ్రామ శాఖ అధ్యక్షుడు మద్దెపురి ఐలయ్య యాదవ్, మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి, గోగు సత్తయ్య, తెలంగాణ ఉద్యమ నాయకుడు బొడ్డుపల్లి లింగయ్య, ఎండీ ఇమామ్, గోగు హరిప్రసాద్, చీరగోని నవీన్, గోగు సురేష్, కనుకు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

