డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 21(నమస్తే న్యూస్).
గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల మరియు పాఠశాల విద్యార్థులకు మరిపెడ సీఐ ఎల్ పవన్ కుమార్,ఎస్సై గండ్రాతి సతీష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.అంతర్జాల మోసాలు,రహదారి ప్రమాదాలు,మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు వివరించారు.అదేవిధంగా పిల్లల నైతిక ప్రవర్తన గురించి మాట్లాడారు.ఇటీవల కాలంలో జరిగిన ప్రధానాచార్యురాలు రూపా రెడ్డి హత్య, విజయనగరంలో కుమారుడి చేతిలో తల్లి స్పందన హత్య,కేరళలో 13 ఏళ్ల బాలిక ప్రియుడి చేతిలో తాత హత్య వంటి ఘటనలను ఉదాహరణలుగా చెబుతూ,పిల్లలు నేరాలు చేసేందుకు గల కారణాలను వివరించారు.
పిల్లలు నేర ప్రవృత్తి వైపు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశమని, నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని, అందుకే విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు రాంమోహన్,ఉప ప్రధానాచార్యులు రాజకుమార్, పీఈటీ బాలు మహేంద్ర పాల్గొన్నారు.


