8 ఏళ్లుగా డెవలప్ మెంట్ చేయకుండా తిప్పుతున్నారని ఆరోపణ.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 21(నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది.మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి అక్షిత రియల్ ఎస్టేట్ వెంచర్ పేరుతో ప్లాట్లు విక్రయించి,డెవలప్ మెంట్ చేయకుండా 8 ఏళ్లుగా తిప్పుతున్నారని ముగ్గురు బాధితులు శుక్రవారం మరిపెడ ఎస్ఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన గంట శ్రీనివాస్ తండ్రి వెంకటయ్య (48),కందిపాటి విజయ్ కుమార్ తండ్రి వెంకన్న (42),అలాగే ఇస్లావత్ రమేష్,ఇస్లావత్ తండ,కొరివి మండలం గ్రామాలకి చెందిన ముగ్గురు పిర్యాదు చేశారు.తాము ముగ్గురం కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు.బాధితుల కథనం ప్రకారం..చుండ్రు రాజ్ కుమార్ అక్షర రియల్ ఎస్టేట్ వెంచర్ పేరుతో వెంచర్ వేశారు.అందులో తాము సోదరులతో కలిసి 78 ప్లాట్లు అమ్మాము.వెంచర్ యజమాని మరియు డెవలపర్ అయిన చుండ్రు రాజ్ కుమార్ బ్రోచర్ లో పేర్కొన్న విధంగా చుట్టూ ఫెన్సింగ్,అంతర్గత రోడ్లు,ప్రతి ప్లాటుకు నల్లా కనెక్షన్ వంటి డెవలప్ మెంట్ పనులు చేయాల్సి ఉండగా,గత 8 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చేయకుండా తిప్పుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అదే చుండ్రు రాజ్ కుమార్ ఎల్లంపేట,బీరిశెట్టిగూడెం గ్రామాల పరిధిలోని భూములు తీసుకుని డవలప్మెంట్(వెంచర్)చేశారని,అందులోగూడ మేము ప్లాట్లు అమ్మించినాము అక్కడ కొన్నవారు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
2020 డిసెంబర్ లో ఎం. సత్యలింగం అనే వ్యక్తి వద్ద నుండి వెంచర్ డెవలప్ మెంట్ చేస్తానని చెప్పి చుండ్రు రాజ్ కుమార్ కు రూ. 20 లక్షలు ఇప్పించామని, అయితే వెంచర్ లో ఎలాంటి డెవలప్ మెంట్ పనులు చేయకపోవడమే కాకుండా, తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని వాపోయారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తి తిరిగి డబ్బులు అడుగుతుండటంతో ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని, పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెడితే రూ. 15 లక్షలు ఇచ్చి మిగతా రూ. 5 లక్షలు ఇప్పటివరకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపారు.ఇంటికి వెళితే కలవడం లేదని, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని, ప్లాట్లు అమ్ముడుపోవడం లేదని సాకులు చెబుతూ తిప్పుతున్నాడని, గట్టిగా అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తన అనుచరుడు పాండు మరియు ఇతర అనుచరులతో బెదిరింపు ఫోన్లు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.చుండ్రు రాజ్ కుమార్, పాండు మరియు వారి అనుచరుల వల్ల తాము భయంతో జీవిస్తున్నామని, తట్టుకోలేకే పోలీసులను ఆశ్రయించామని బాధితులు తెలిపారు. తమకు జరిగిన మోసంపై విచారణ జరిపి, వెంచర్ డెవలప్ మెంట్ చేయించి న్యాయం చేయాలని వారు పోలీసులను కోరారు.


