రామన్నపేట ఆగస్ట్ 21( నమస్తే న్యూస్)
కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ప్రస్తుత విద్యా వ్యవస్థకే మాయనిమచ్చ అని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి,రూపారెడ్డి హత్య ను నిరసిస్తూ శుక్రవారం మండల వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల బంద్ కార్యక్రమం నిర్వహించారు, అన్ని పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధిఉపాద్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం నుండి సుభాష్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు, అనంతరం సుభాష్ సెంటర్ లో ఏర్పాటు చేసిన రూపారెడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు కరెస్పాండెంట్స్ మాట్లాడుతూ నేటి విద్యా వ్యవస్థలో కొంతమంది విద్యార్థుల, వారి తల్లిదండ్రులు ధోరణి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు,సమాజ మనుగడలో గురుతర బాధ్యత వహించే ఉపాధ్యాయులకు రక్షణ కరువైందని, ఇది విద్యా వ్యవస్థ మనుగడకు పెను ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు, రూపారెడ్డి హంతకులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరెస్పాండెంట్స్ టి. మల్లిఖార్జున్, జె. మార్టిన్, జి. నరేందర్ రెడ్డి, కనకచారి, నాగరాజు, శ్రీధర్ ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాద్యాయులు, పాల్గొన్నారు.

