బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్
తిరుమలాయపాలెం ఆగస్టు 21 (నమస్తే న్యూస్ )
రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి యూరియా కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం నిరంతరం యూరియా సరఫరా చేస్తోందని తెలిపారు.రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన యూరియాను పొందేందుకు మీ-సేవ కేంద్రాల ద్వారా రైతులకు పది రూపాయలకే ఆన్లైన్ చేసుకుని ఎసులుబాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని బిజెపి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్ తెలిపారు.

