తిరుమలయపాలెం ఆగస్టు 21 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండల పరిధిలోని అజ్మీర తండ గ్రామంలో రెండు సంవత్సరాలుగా మూతి పడిన ప్రాథమిక పాఠశాల పట్టించుకోని పై అధికారులు చిన్నపిల్లలు చదువుకోవడానికి ఇబ్బందికరంగా మారింది. కొంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల పాఠశాల తీయడం లేదని ప్రైవేటు పాఠశాలలకు వెళుతున్నారు. మరి కొంతమంది పిల్లలు జల్లేపల్లి ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నారు. వెంటనే పాఠశాలను పున ప్రారంభించాలని తల్లిదండ్రులు, పిల్లలు వేడుకుంటున్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా టీజేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో పాఠశాలను అజ్మీర తండా పాఠశాలను సందర్శించడం జరిగింది. రెండు సంవత్సరాల నుంచి మూతబడిన పాఠశాలను సందర్శించడం జరిగింది. వారు మాట్లాడుతూ గిరిజన బిడ్డలకు విద్యను దూరం చేస్తున్న పట్టించుకోని అధికారులు చదువుల తల్లి సరస్వతి ఎస్సీ ఎస్టీ పిల్లలకు విద్యను దూరం చేస్తు తక్కువ మంది పిల్లలు ఉన్నారని నెపంతో అజ్మీర తండా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మరొక గ్రామానికి డిప్యూటీషన్ మీద పంపించారు. పది పదిహేను మంది పాఠశాలలో చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలకు ఉపాధ్యాయులను వెంటనే ఏర్పాటు చేయాలని ఖమ్మం జిల్లా టీజేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ అన్నారు. అజ్మీర తండా పాఠశాలను చూసి మనస్సు కలిసి వేసిందన్నారు ప్రభుత్వ పాఠశాల అంటే చదువులకు అమ్మ ఒడిలాంటిది అన్నారు. ఇలాంటి పాఠశాల బోసిపోయి ఉండడం చూసి మనసు కలిసి వేసింది అన్నారు. గత రెండు సంవత్సరాలుగా మూసివేసిన పాఠశాలను వెంటనే పునర్ ప్రారంభించి పిల్లలకు చదువులు అందించాలన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు అజ్మీర మోహన్ వార్డ్ నెంబర్, బోడ వాసు వార్డు మెంబర్, బానోతు రవి మాజీ సర్పంచ్, చందావత్ శంకర్, మాజీ సర్పంచ్ గడ్డి కొప్పుల రాజు, గాదరి వెంకన్న, గాదరి బాబు, పిల్లలు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

