తిరుమలాయపాలెం ఆగస్టు 20 (నమస్తే న్యూస్ )మండల కేంద్రానికి చేరుకున్న 21,882 స్మార్ట్ నుంచి గ్రామ పాలన అధికారుల ద్వారా పంపిణీతిరుమలాయపాలెం మండల ప్రజలకు ప్రభుత్వం జారీ చేసిన 21,882 స్మార్ట్ రేషన్ కార్డులు మండల కేంద్రానికి చేరుకున్నాయి. ఈ కార్డులను గురువారం సాయంత్రం నాటికి ఆయా గ్రామపంచాయతీల గ్రామ పాలన అధికారులకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. కార్డులు గ్రామాలకు చేరుకున్న అనంతరం లబ్ధిదారులు తమ స్మార్ట్ రేషన్ కార్డుల కోసం సంబంధిత గ్రామ పాలన అధికారిని సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. కార్డుల పంపిణీ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండల తహసిల్దార్ లూథర్ విల్సన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులు మండలానికి చేరుకున్నాయని, ఆయా గ్రామపంచాయతీలకు కార్డులను పంపిణీ చేసిన అనంతరం లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ప్రజలు తమ గ్రామ పాలన అధికారులను సంప్రదించి స్మార్ట్ రేషన్ కార్డులను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వహిదా బేగం రెవిన్యూ సిబ్బంది రవి శ్రీను సైదులు శ్రీను షేక్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

