తొర్రూరు, ఆగస్టు20(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన నకేర కంటి కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవే పరమావధిగా భావిస్తూ బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ ఓ అభిమాని ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, ప్రజల సమస్యలపై స్పందించే తీరుతో స్ఫూర్తి పొందిన ఆయన, సమాజానికి తనవంతు సహాయం అందించాలనే సంకల్పంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల కిస్టాపురం గ్రామంలో అకాల మరణం చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ 25 కేజీల బియ్యం సహాయం చేస్తూ… ఆ గ్రామానికి చెందిన నకేర కంటి ముత్తయ్య, నకేర కంటి వంశీ, స్వప్న, భూలక్మీ అకాల మరణానికి చింతిస్తూ వారి చిత్రపటాలకు పూలమాలవేసి వారి కుటుంబాలకు తన వంతుగా సహాయం చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి అండగా నిలవడం, అవసరమైన వారికి సహాయం చేయడం, యువతను సామాజిక సేవ వైపు ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జనసేన గ్రామ పార్టీ అధ్యక్షుడు నకేర కంటి కళ్యాణ్ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడమే తన లక్ష్యమని ఆయన పేర్కొంటున్నారు.
పవన్ కళ్యాణ్ చూపిన ప్రజా సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అభిమానం మాటల్లో కాకుండా సేవా రూపంలో చూపించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ అభిమాని పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సుమన్, దినేష్, రాజు, శివ , జోసఫ్,స్వామి తేజ్,కిరణ్, కిషోర్ సన్నీ, వంశీ, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.


