సమానత్వంతో కూడిన దేశం నిర్మాణానికి కృషి చేద్దాం : మండల అధ్యక్షులు హరికృష్ణ
దంతాలపల్లి మండల కేంద్రంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
దంతాలపల్లి, ఆగస్టు 20 (నమస్తే న్యూస్)
దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యం, ఐక్యతను పెంపొందించాలనే సందేశంతో జరుపుకునే సద్భావనా దినోత్సవం ప్రజలందరికీ ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది. ‘సమైక్యతే మన శక్తి – సద్భావనే మన ప్రగతి’ అనే స్ఫూర్తితో రాజీవ్ గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని, శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వంతో కూడిన బలమైన భారతదేశ నిర్మాణానికి మన వంతు కృషి చేద్దాం” అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడుపుగంటి హరికృష్ణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు గురుపాల్ రెడ్డి, సమన్వయ కమిటీ చైర్మన్ సాధు లింగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొమ్మినేని సతీష్, బిసి సెల్ అధ్యక్షులు తండా రాములు, మైనార్టీ సెల్ అధ్యక్షులు షరీఫ్, దొనకొండ సర్పంచ్ ఆవుల సురేష్ యాదవ్, కొత్త యాకన్న గౌడ్, బొడ్డుపల్లి వెంకన్న, రామవరం -దైద వెంకన్న, పోట్యా నాయక్ కోమటి మురళి, ఉపసర్పంచ్ లు వేములపల్లి – ప్రసన్న, దంతాలపల్లి ఉపసర్పంచ్ దాసరి వెంకన్న, బొడ్లడా -బి. సతీష్, ఓలాద్రి రమేష్ రెడ్డి, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు ఏరుకొండ రమేష్, పొన్నం సోమన్న, గుండాగాని వెంకన్న, మార్త విజయ్, బానోత్ రవీందర్, బొడ్లోడా నాగయ్య, మల్లం శ్రీను ఏరుకొండ యాకన్న, ఓలాద్రి రమేష్ రెడ్డి, ఓలాద్రి వెంకట్ రెడ్డి, కొప్పుల శ్రీను, గండి వెంకట్, మర్రు శ్రీను, నారాయణ, మురికి అనిల్, కాయిత శ్రీను, నరేష్ యాకాంబరం, అబ్దుల్, డాక్టర్ వెంకటేశ్వర్లు, మిడితపల్లి సురేందర్, ప్రదీప్ రెడ్డి, బొల్లు వీరన్న, చిల్లా సత్యనారాయణ దంతాలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


