చిట్యాల ఆగస్ట్ 20( నమస్తే న్యూస్ ) నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారు ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటును నిలిపివేయవలసిందిగా స్థానిక తహసీల్దార్ విజయ్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు, ఈ ప్లాంట్ ఏర్పాటు వలన పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలకు, సుమారు వంద మంది రైతుల ప్రత్యక్ష జీవనోపాధికి మరియు సాధారణ ప్రజల జీవనానికి అనేకమైన తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్లాంట్ నుండి వెలువడే సిమెంట్, ఇసుక, రాళ్ల దుమ్ము వల్ల గాలి కాలుష్యం ఏర్పడి పంటలపై దుమ్ముపేరుకుపోయి పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని ,భారీ వాహనాల రాకపోకల వల్ల గ్రామీణ రహదారులు దెబ్బతినడంతో పాటు ప్రజలకు, విద్యార్థులకు మరియు రైతులకుప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వారు తెలిపారు.ప్లాంట్ నిర్వహణలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు, మురుగునీరు వ్యవసాయ భూములు లేదా నీటి వనరుల్లోకి చేరితే నేల మరియు నీటి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. ఈ ప్లాంటు ప్రదేశాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్ పరిశీలించి పంట పొలాలకు ,ప్రజలకు ఎలాంటి సష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో గంట్ల మహేందర్ రెడ్డి , రవీందర్ రెడ్డి , గుత్తా లవకుమార్ , పున్న రాజు , యాదగిరి , విరమల్లు ,లింగారెడ్డి , ముత్తయ్య , రాములు ,రవి తదితరులు ఉన్నారు.

