రామన్నపేట,ఆగస్ట్ 20( నమస్తే న్యూస్ )
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు,పున్న జగన్ మోహన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వలిగొండ రామన్నపేట మార్కెట్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి మల్లారెడ్డి,రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు, అనంతరం వారు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు,18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించడం ద్వారా యువత రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచిన చారిత్రాత్మక నిర్ణయం రాజీవ్ గాంధీ దే అని అన్నారు,దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు తీసుకెళ్లి, ఐటీ విప్లవానికి పునాదులు వేసిన దూరదృష్టి గల నాయకుడిగా రాజీవ్ గాంధీ అని అభివర్ణించారు,అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు నేటికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల భారంలోకి నెడుతోందని, పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, మత విద్వేషాలను పెంచుతోందని విమర్శించారు,యువత, పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అని, ఆయన ప్రధానమంత్రి అయితే ప్రజా సంక్షేమం, అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆకాంక్షించారు,రాజీవ్ గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకుల ఓటరు నమోదును కార్యక్రమంను ఈ సందర్బంగా ప్రారంభించారు,ఈకార్యక్రమంలో పాల్గొన్న వారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కందిమల్ల గోపాల్ రెడ్డి, రామన్నపేట ఉపసర్పంచ్ మోటే రమేష్, వనం చంద్రశేఖర్, సాల్వేర్ అశోక్, బొడ్డు సాలయ్య,గుత్తా నర్సిరెడ్డి, మొహమ్మద్ నాసర్, బండ అంజిరెడ్డి ,జిల్లా వెంకటేశం, పిట్ట వెంకటరెడ్డి, మహమ్మద్ అక్రమ్, కోట సుధాకర్ ,బత్తుల నవీన్, ఆముద లక్ష్మణ్ ,పున్న అమరేందర్ ,ఏ పరమేష్, కొమ్ము రామస్వామి గొరిగే శేఖర్ బండ లింగస్వామి, మోటే మహేష్ ,కేశవదాస్ ,వెంకటేష్ బొడ్డు, శంకరయ్య ,ఎండి మన్సూర్ అలీ, ఎండి అజార్ ,హరిబాబు, కొండ శేఖర్ గౌడ్ ,మహమ్మద్ రిజ్వాన్, మిర్జా ఈనాయతుల్లా బేగ్, చిర్రబోయిన నవీన్ ,గంగాపురం శంకర్ ,సహదేవ ,కక్కినేని రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
