మహబూబాబాద్, ఆగస్ట్.19 (నమస్తే న్యూస్ డెస్క్)
బుధవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ ఆధ్వర్యంలో వైద్యాధికారులు, , మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జిల్లాలో ప్రజారోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ గర్భిణీల ANC రిజిస్ట్రేషన్‌ను వంద శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నివారించగల అబార్షన్లు జరగకుండా అవసరమైన అవగాహన, వైద్య సేవలు మరియు పర్యవేక్షణ చేపట్టాలని, 14–15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు హెచ్.పి.వి వ్యాక్సిన్‌ను వంద శాతం అందించేలా చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు చేపట్టి, వ్యాధుల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఫైలేరియా బాధితులు అర్హత మేరకు పెన్షన్‌కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించి, అవసరమైన సహాయాన్ని అందించాలని అన్నారు.నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగ్‌ను వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కేంద్రాల్లో నిర్ణీత సమయపాలన పాటిస్తూ, ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించాలని సూచించారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. ప్రమీలారావు, డా. సుధీర్‌రెడ్డి, ప్రోగ్రామ్ అధికారులు శివ, అర్జున్, ప్రాథమిక వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

