సంఘం నూతన కార్యవర్గానికి ఎస్పీ డాక్టర్ శబరీష్ శుభాకాంక్షలు
మహబూబాబాద్, ఆగస్టు 20 (నమస్తే న్యూస్ డెస్క్):
మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం 2026 ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన అధ్యక్షుడు ఎస్. చంద్రశేఖర్ (ARPC 433) ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు ఎస్పీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నూతన కార్యవర్గానికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా బి. సోములు (RI MTO), బి. వెంకన్న (SI, నర్సింహులపేట), కార్యదర్శిగా జి. శేఖర్ (RSI), సంయుక్త కార్యదర్శిగా బాదె రామయ్య (ARPC 1094), ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి. అనిల్ (PC 06, మహబూబాబాద్ టౌన్ పీఎస్), కోశాధికారిగా ఎల్. మంగీలాల్ (PC 78, డోర్నకల్ పీఎస్) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా లింగస్వామి, సుప్రజ, సురేష్, నాగమణి, ఈ. సురేష్, యాకన్న గౌడ్ ఉన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ శబరీష్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సంక్షేమం, పరస్పర సమన్వయం, క్రమశిక్షణతో కూడిన విధి నిర్వహణలో పోలీస్ అధికారుల సంఘం మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సిబ్బంది సమస్యలను సమన్వయంతో పరిష్కరించేందుకు సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు.పోలీస్ అధికారుల సంఘం ఎన్నికల నోడల్ అధికారిగా ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఎన్నికల పరిశీలకుడిగా ఇన్స్పెక్టర్ హతీరామ్, సీఐ వినయ్, ఎస్ఐ దీపిక వ్యవహరించి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఈ సందర్భంగా పలువురు అధికారులు అభినందించారు.

