డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 19(నమస్తే న్యూస్)
సిపిఐ(ఎం) మరిపెడ (బంగ్లా) టౌన్ శాఖ కార్యదర్శి దొంతు సోమన్నకు మాతృవియోగం సంభవించింది.మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన ఆయన తల్లి దొంతు నాగరత్నం వృద్ధాప్యం,అనారోగ్య కారణాలతో మంగళవారం కన్నుమూశారు.ఈ విషయం తెలుసుకున్న సిపిఐ(ఎం)మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్,మండల నాయకులు బానాల రాజన్న,జిన్నా లచ్చయ్య,ఐద్వా నాయకురాలు దొంతు మమత,సిఐటియు నాయకులు దుండి వీరన్నతో పాటు పలువురు పార్టీ నాయకులు,కార్యకర్తలు నాగరత్నం పార్థివ దేహాన్ని సందర్శించారు.పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా దొంతు సోమన్న కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,నాగరత్నం ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

