రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 19 (నమస్తే న్యూస్ )
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్ల మండల అధ్యక్షులు బోడపట్ల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బోడపట్ల సతీష్ గౌడ్ ఫోటోగ్రఫీ జెండాను ఆవిష్కరించి ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం బోడపట్ల సతీష్ మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన సంఘటనను కెమెరాలో బంధిస్తూ ప్రజలకు చేరువ చేయడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఒక ఫొటో వెయ్యి మాటలతో సమానమని, చరిత్రను భద్రపరచడంలో ఫోటోగ్రాఫర్లు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎండ, వానను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తూ వార్తలను ప్రజలకు చేరవేస్తున్న ఫోటోగ్రాఫర్ల సేవలను గుర్తించాలని అన్నారు.ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ వేడుకలకు హాజరైన ఖమ్మం జిల్లా టీజేఏసీ అధ్యక్షులు మందడి ఇజ్రాయిల్ సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ వారు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు.ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన సంఘటనకు శాశ్వత జ్ఞాపకంగా నిలిచే చరిత్ర అని అన్నారు. ప్రతి కార్యక్రమాన్ని కెమెరాలో బంధించి ప్రజలకు చేరవేయడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు.
ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న ఫోటోగ్రాఫర్ల సేవలు అభినందనీయమన్నారు. ఒక మంచి చిత్రం ఎన్నో విషయాలను మాటలు లేకుండానే ప్రజలకు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు ఖమ్మంలో జరిగిన వేడుకల్లో తిరుమలాయపాలెం మండలం సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమం లో ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా అధ్యక్షులు మండల ఇజ్రాయిల్ సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మండల అధ్యక్షులు బోడపట్ల సతీష్ ప్రధాన కార్యదర్శి దారమల్ల శంకర్ ఎల్ కిషోర్ కొండ్రు రమేష్ సందీప్ మహేష్ విజయ్ రాము సతీష్ తదితరులు పాల్గొన్నారు.

