రామన్నపేట ఆగస్ట్ 19(నమస్తే న్యూస్)
యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పలు గ్రామాలలో యువత రాత్రి సమయంలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, దీనిని అరికట్టేందుకు రాత్రి సమయంలో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రామన్నపేట మండల అధ్యక్షులు కళ్లెం ఉపేందర్ రామన్నపేట సీఐకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ, మండలంలోని, అన్ని గ్రామాలలో రాత్రి 9 గంటల తర్వాత కొంతమంది యువకులు గుంపులుగా చేరి మద్యం సేవిస్తున్నారని, దీనివలన మహిళలు, వృద్ధులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు, గ్రామాలలో గొడవలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, విద్యార్థులపై చెడు ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు,కావున పోలీస్ శాఖ వారు రాత్రి 8 PM నుండి ఉదయం 12 AM వరకు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి, నేరాలను అరికట్టాలని, తప్పు దోవ పట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు,ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, ఈ విషయంలో పోలీస్ అధికారులు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

