రామన్నపేట ఆగస్ట్ 19(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన బాలరాజు, రామన్నపేట పట్టణానికి చెందిన చెరుకు సత్యనారాయణ గతంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేశారు. 2006 నుంచి 2019 వరకు విధులు నిర్వహించిన తమను జాబ్కార్డుల్లో పనిదినాలు 10 శాతానికి తగ్గిన కారణంగా విధుల నుంచి తొలగించినట్లు వారు తెలిపారు, ప్రస్తుతం వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా తిరిగి పనిచేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు, ఈ మేరకు బుధవారం రామన్నపేట ఎంపీడీవో ఏ. రాములు, ఏపీవో వెంకన్నకు వినతిపత్రం అందజేశారు,గతంలో సుమారు 13 సంవత్సరాల పాటు అందించిన సేవలు, తమకు ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు అధికారులను విజ్ఞప్తి చేశారు, ఉపాధి హామీ పథకం అమలులో తమ అనుభవాన్ని వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వినతిపత్రం ద్వారా కోరారు.

