డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 19(నమస్తే న్యూస్).
ఉమ్మడి గ్రామ పంచాయతీ వాస్తవ్యులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుగులోత్ రవి నాయక్ కి ఆనేపురం గ్రామ ప్రజల తరపున ఘనంగా శాలువాలతో సన్మాణం చేయడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు,యువకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి రవిని శాలువాతో సన్మానించి,పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియచేశారు.గ్రామ అభివృద్ధికి,పార్టీ బలోపేతానికి అధ్యక్షులు రవి కృషి ఎంతో ఉపయోగపడుతుందని,ఆయన నాయకత్వంలో మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని గ్రామస్తులు ఆకాంక్షించారు.రవి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని,ఆయన ఎదుగుదలకు ఆనేపురం గ్రామ ప్రజలందరం పూర్తి సహకారం అందిస్తామని గ్రామస్తులు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

