రైతులు అప్రమత్తంగా ఉండాలనీ సూచించిన ఎస్సై సతీష్
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 18(నమస్తే న్యూస్).
మరిపెడ, ఆగస్టు 18(నమస్తే న్యూస్): పత్తి చేనులో కలుపు తీస్తుండగా పాము కాటేయడంతో మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బాల్నే ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన మక్కల రాములమ్మ (65) తన భర్త భిక్షంతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 17న గ్రామంలోని పత్తి చేనులో తోటి కూలీలతో కలిసి కలుపు తీస్తుండగా ఆమెను పాము కాటేసింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాములమ్మ మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు మృతి చెందింది. ఘటనపై మృతురాలి కుమారుడు మక్కల పిచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరిపెడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గుండ్రాతి సతీష్ తెలిపారు.

