పిండిప్రోలులో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
రిపోర్టర్ దామల్ల భాస్కర్.
తిరుమలాయపాలెం ఆగస్టు 18 (నమస్తే న్యూస్)
మొగల్ సామ్రాజ్య అహంకారంపై సమర శంఖం పూరించి, గోల్కొండ కోటపై స్వాభిమాన పతాకాన్ని రెపరెపలాడించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పిండిప్రోలు గ్రామ ఉపసర్పంచ్ చామకూరి రాజ్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం పిండిప్రోలు గ్రామంలో గౌడ సంఘం అధ్యక్షులు చావగాని ఉపేందర్ కార్యదర్శి చామకూరి వీరభద్రం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు చావగాని ఉపేందర్ ప్రధాన కార్యదర్శి చామకూరి వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ వీరత్వానికి ప్రతీకగా, తొలి బహుజన చక్రవర్తిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. పిండిప్రోలు గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని వక్తలు అన్నారు.సామాజిక సమానత్వం, స్వాభిమానం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, బహుజనుల ఆత్మగౌరవానికి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు చావగాని ఉపేందర్ ప్రధాన కార్యదర్శి చామకూరి వీరభద్రం చామకూరి శ్రీనివాస్ పరికిపల్లి చంద్రశేఖర్ చామకూరి రమేష్ నాథ్ సత్యనారాయణ చామకూరి రవి కాంపాటి వెంకన్న కాంపాటి నాగేశ్వరరావు గౌడ సంఘం నాయకులు, సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

