రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 18 (నమస్తే న్యూస్ )
తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మొదటి రోజు గ్రామపంచాయతీ వర్కర్స్ డిమాండ్ తో కూడిన నిరసన దీక్ష ను తిరుమలాయపాలెం ఎంపీడీవో ఆఫీస్ ముందువిజయవంతంగా కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు వసపంగువీరన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కార్మికులకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి మోసం చేసిందని సాలిసాలని జీతంతో బతుకులు ఈడిస్తున్న గ్రామపంచాయతీ వర్కర్ల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఇప్పటికైనా గ్రామాభివృద్ధికి పట్టుకొమ్మలైన గ్రామపంచాయతీ వర్కర్స్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వారి కుటుంబాల్లో వెలుగును నింపుతూ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకొని పరిపాలన కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే బషీర్ ఎస్ కే పాషా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వర్కర్స్ కు ఇబ్బందిగా ఉన్న జీవో నెంబర్ 51 ని వెంటనే సవరించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అర్హులైన గ్రామపంచాయతీ కార్మికులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇందిరమ్మని ఇవ్వాలని గ్రీన్ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారము వేతనాలు చెల్లించాలని కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని ఇట్టి న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అమలుపరచాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రెండో రోజు కూడా దీక్షలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ యూనియన్ నాయకులు ఎస్కే బషీర్, ఎస్కే పాషా జిల్లా ఉప్పలయ్య సంగయ్య గురవయ్య శ్రీను కొమ్ము రవిసైదులు రామ్మూర్తి కొప్పుల రాజేష్ ముత్తయ్య బంక వెంకటేశ్వర్లు సీమ నాగేష్ నేలమర్రి బాబు తదితరులు పాల్గొన్నారు.

