రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 18 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలం లోని సుబ్లేడు ప్రజా ప్రభుత్వంలో భాగంగా తిరుమలయపాలెం మండలం సుబ్లేడు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏ ఎన్ ఎం సుభద్ర నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ తదితర వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న ఆసుపత్రి సిబ్బంది సేవలను గ్రామ ప్రజలు అభినందించారు.ఈ సందర్భంగా ఏఎన్ఎం సుభద్ర మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.సేవలో ముందుండే వైద్య సిబ్బందిప్రజలకు వైద్య పరీక్షలు, మందుల పంపిణీతో పాటు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్న సుబ్లేడు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సేవలు అభినందనీయమని గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు దోమల్ల సత్యవతి, కూరపాటి లత, మోటామర్రి నాగేంద్ర తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

