మహబూబాబాద్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ ఆర్ సత్యనారాయణ రెడ్డి.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 18(నమస్తే న్యూస్).
నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామసహాయం సత్యనారాయణరెడ్డి, రామసహాయం ఆనందరెడ్డి, రామసహాయం అజిత్ రెడ్డి, నాయిని వెంకటలక్ష్మి నరసింహారెడ్డి ,కేతిరెడ్డి సత్యనారాయణరెడ్డి తదితరులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని,ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.అదే విధంగా ఆయన ఆయురారోగ్యాలతో చల్లగా ఉండి, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేయాలని,ప్రజాక్షేత్రంలో ఇదే ఉత్సాహంతో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ,అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు.

