డోర్నకల్/మరిపెడ, ఆగస్టు 18(నమస్తే న్యూస్).
మరిపెడ మండలం వెంకంపహడ్ గ్రామ సర్పంచ్ ఉప్పల సోమన్న(32)నిన్న రాత్రి బైక్ ప్రమాదానికి గురై మృతి చెందారు.ఈ విషాద వార్త తెలుసుకున్న నేతలు మంగళవారం ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డి.ఎస్.రెడ్యానాయక్,మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు సోమన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న నేతలు,యువ సర్పంచ్ మృతి గ్రామానికి,ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని,కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉగ్గంపల్లి సర్పంచ్ యండి అయూబ్ పాష, మాజీ ఎంపిటిసి గుగులోత్ వెంకన్న, అవిలయ్య, మాజీ సర్పంచ్ తప్పెట్ల వెంకన్న, తపెట్ల విజయ్, కోడిగంటి సతీష్, లింగయ్య, వీరన్న, కిషన్, శేఖర్, అనిల్, సురేష్, పట్ల వంశీ,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


