యాదాద్రి భువనగిరి జిల్లా ,ఆగస్ట్ 18 (నమస్తే న్యూస్ )
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం గారి ఆదేశానుసారం వెల్లంకి గ్రామ మాజీ ఎంపీటీసీ,యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి గారు ప్రాథమిక పాఠశాలకు రెండు కంప్యూటర్లను మరియు ఒక ప్రింటరును బహుకరించారు.ఈ కార్యక్రమంలో వెల్లంకి గ్రామ సర్పంచ్ శ్రీమతి ఇడెం రాధ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులందరూ కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలకు శిథిలావస్థలో ఉన్న గదుల స్థానంలో కొత్త గదులను ఎమ్మెల్యే గారి సహకారంతో మంజూరు చేయించాలని కోరారు. మాజీ ఎంపిటిసి శ్రీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటామని, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న గదుల స్థానంలో రెండు అదనపు గదులను ఎమ్మెల్యే గారి సహకారంతో తీసుకువస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో AAPC చైర్ పర్సన్ పులగం సులోచన గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి , ఉయ్యాల బిక్షమయ్య, మందుగుల వెంకటయ్య , ఇడెం స్వరూప సేవా ట్రస్ట్ చైర్మన్ ఇడెం శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిటిపాముల పెద్దులు,నాయకులు గంజి నర్సింహ,భాస్కర్, చక్రపాణి, గోషిక కొండల్ రెడ్డి,కనుత్తాల భాస్కర్ రెడ్డి, ఎడ్ల సంజీవ రెడ్డి, రుద్ర వెంకటేష్,మిరియాల నరేశ్, మిరియాల వెంకటేష్,గోధుమల సోమప్ప మరియు తదితరులు పాల్గొన్నారు.



