తిరుమలాయపాలెం ఆగస్టు 17 (నమస్తే న్యూస్ )
కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తిరుమలాయపాలెం ఎంపీడీవో కి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు వశపంగు వీరన్న మాట్లాడుతూ తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో 18 19 తేదీలలో ఎంపీడీవో ఆఫీసుల ముందు నిరసన దీక్షలు చేపడుతున్నట్లు వారు తెలిపారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని నిరసిస్తూ గ్రామపంచాయతీu కార్మికులు రెండు రోజులు నిరసన దీక్షలు చేస్తున్నారు కార్మికులకు ఇబ్బంది కలిగించే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని జీవో నెంబర్ 51 సవరించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారము గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులను అక్రమంగా ప్రభుత్వ జోక్యం లేకుండా సర్పంచులు తొలగించకూడదని మరణించిన కార్మికుడికి దాన సంస్కారాల నిమిత్తము 30 వేల రూపాయలు ఇవ్వాలని మరణించిన వ్యక్తి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని అర్హులైన గ్రామపంచాయతీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ దీక్షలు చేస్తున్నట్లు వారు తెలిపారు ఎంపీడీవో కు వినతి పత్రం ఇచ్చిన వారిలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ గౌరవ ధ్యక్షులు ఎస్కే పాషా వెంకన్న రాజేష్ ముత్తయ్య రవి తదితరులు పాల్గొన్నారు.

