రైతు బీమా,కళ్యాణ లక్ష్మి నిలిపివేత.రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఆగ్రహం.
5 లక్షల బీమా ప్రమాదంలో.ప్రజాపాలనలో పేదలకు అన్యాయం.
420 హామీలతో వచ్చి,అందుతున్న పథకాలను ఆపేశారు.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 17(నమస్తే న్యూస్). తెలంగాణలో రైతు బీమా పథకానికి సంబంధించి ఎల్ఐసికి ప్రీమియం చెల్లించాల్సిన గడువు ఆగస్టు 14తో ముగిసినా,రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.దీంతో రైతులకు ఉండే 5 లక్షల ప్రమాద బీమా నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.రోడ్డెక్కిన బీఆర్ఎస్ నేతలు. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు డోర్నకల్ నియోజకవర్గంలో భారీ ధర్నా నిర్వహించారు. డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత,మాజీ మంత్రి డి.ఎస్. రెడ్యానాయక్ అధ్యక్షతన,మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు సమక్షంలో ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై ప్రభుత్వ అతిథి గృహం ముందు బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.రైతులకు భరోసా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే:రెడ్యానాయక్. ఈ సందర్భంగా మాజీ మంత్రి రెడ్యానాయక్ మాట్లాడుతూ,బీఆర్ఎస్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతు బీమా,రైతుబంధు,సాగునీరు అందించామని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి భరోసా ఇచ్చామన్నారు.పేదింటి ఆడబిడ్డ పెళ్లికి మేనమామలా నిలిచి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్షా 16 వేల చెక్కు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం,పేదలకు వరంగా ఉన్న రైతు బీమా,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.వెంటనే గత ప్రభుత్వ పథకాలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.అమలు చేయాలెని హామీలతోనే అధికారం:నవీన్ రావు.మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.కొత్త పథకాలు ఇవ్వడం లేదు సరికదా,ఉన్న పథకాలకు కూడా పంగనామం పెట్టారని ఆరోపించారు.రైతు ఏ కారణంతోనైనా చనిపోతే కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు పెట్టిన రైతు బీమాకు ప్రీమియం చెల్లించకపోవడం దారుణమన్నారు.తెలంగాణను ఆగం చేస్తున్నారు:రవిచంద్ర.. బీఆర్ఎస్ యువ నాయకులు డి.ఎస్. రవిచంద్ర మాట్లాడుతూ,కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మోటార్ల ద్వారా నీరు ఎత్తిపోయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.ప్రజాపాలన పేరుతో పేదల పథకాలను నిలిపివేయడం సరికాదని,వెంటనే తొలి తేదీ నుండే పథకాలను కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సర్పంచులు,వార్డు కౌన్సిలర్లు,మాజీ సర్పంచులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రజావాణిలో ఫిర్యాదు. రైతు బీమా,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ మరిపెడ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో నవీన్ రావు,బీఆర్ఎస్ నాయకులు ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి,ఎమ్మార్వో కృష్ణవేణిలకు వినతిపత్రం అందజేశారు.




