తిరుమలాయపాలెం ఆగస్టు 17 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలంలోని పాతర్లపాడు గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కిందికి ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని, దాని పక్కనే ఎత్తైన ట్రాన్స్ఫార్మర్ దిమ్మె నిర్మించి ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని గతంలో కోరారు.గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు ట్రాన్స్ఫార్మర్ దిమ్మె నిర్మించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు కొత్తగా దిమ్మె నిర్మించినప్పటికీ, దానిపై ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.మంత్రి ఆదేశాలు ఇచ్చినా విద్యుత్ శాఖ ఏఈ స్థాయిలో పనులు ముందుకు సాగకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ను వెంటనే కొత్త దిమ్మెపై ఏర్పాటు చేసి, ప్రమాదకర పరిస్థితిని తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు.


