మాల మహానాడు నేతల డిమాండ్
తిరుమలాయపాలెం ఆగస్టు 17 (నమస్తే న్యూస్ )
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ వద్ద మాలల మహా గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన మాలల మహా గర్జన సభలో మాల మహానాడు నేతలు గుంతేటి వీరభద్రం పల్లా రాజశేఖర్ లింగాల రవికుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు విధానం వల్ల మాలలు పూర్తిస్థాయిలో నష్టపోతున్నారని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎంపరికల్ డేటా ఆధారంగా విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాలలో షెడ్యూల్డ్ కులాల స్థితిగతులను సమగ్రంగా సర్వే చేసి తాజా జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేపట్టకుండా హడావుడిగా రాజకీయ ప్రయోజనాల కోసం అసంబద్ధంగా అన్యాయంగా షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించి అశాస్త్రీయమైన రోస్టర్ విధానంతో మాలలకు విద్యా ఉద్యోగాలలో తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణ పై రాష్ట్ర ప్రభుత్వం పున సమీక్షించి మాలలకు షెడ్యూల్డ్ కులాలకు సమన్యాయం జరిగేలా చూడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మాలలు తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు షెడ్యూల్డ్ కులాల జనాభా కనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచి ఎస్సీ కులాల అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఖమ్మం కలెక్టర్ టీఎస్ దివాకర్ గారికి వినతిపత్రం అందజేశారు కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు
దామల్ల సత్యం బిందె రమేష్ తోగరు భాస్కర్ మెట్టు వెంకటేశ్వర్లు కొరివి దయానంద్ కరాటే వేణు చింతపల్లి వెంకన్న దారా ఏసురత్నం పిల్లి మల్లికార్జున్ కొప్పుల రాములు నారుమళ్ళ వెంకన్న జమ్మి వీరబాబు అంతోటి బుచ్చయ్య రెంటాల ప్రసాదు తలారి నాగభూషణం దాసరి శ్రీను నామా యేసు రత్నం బందెల ప్రకాశం గండమాల అంజి పెరుమాళ్ళపల్లి ప్రసాద్ గుమ్మడి కనకరాజు దా మల్ల అశోక్ కొప్పుల నరసింహారావు రామారావు దుంపల ప్రకాశం కందుల చిన్నప్ప గుంతేటి వెంకటేశ్వర్లు కర్లపూడి శీను దుంపల నాగరాజు నాగటి గోపాల్ ఇ గడ్డయ్య పప్పుల నాగేశ్వరరావు ఎర్ర గంగాధర్ సురేష్ కె వెంకటరత్నం సుభాషిని మేరీ వీరభద్ర జయ తదితరులు పాల్గొన్నారు


