డోర్నకల్/మరిపెడ, ఆగస్టు 17(నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వెంకంపాడు గ్రామ సర్పంచి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన వెంకంపాడు గ్రామ ప్రజలను తీవ్ర దిగ్బాంతికి గురి చేసింది.స్థానికుల వివరాలు… వెంకంపాడు గ్రామ సర్పంచి సోమన్న పని మీద మండల కేంద్రానికివచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో గిరిపురం ముత్యాలమ్మ గుడి సమీపంలో టాటా ఏసీ వాహనం భలంగా డీకొట్టడంతో,తీవ్ర గాయాలైన సోమన్నను వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించగా,తీవ్ర గాయాలైన సోమన్న అప్పటికే మృతి చెందినట్లు సమాచారం.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియవలసి ఉన్నది.పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం…

