రిపోర్టర్: పిల్లల: మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
మహబూబాబాద్ జిల్లా, ఆగస్టు 16(నమస్తే న్యూస్): బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామపంచాయతీ ఎస్సీ కమిటీ హాల్లో సంగపొంగు శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా MRPS, MSP మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ జన్ను దినేష్ మాదిగ, జిల్లా కో-ఇంచార్జ్ ఏకు శంకర్ మాదిగ, MSP జిల్లా నాయకులు కందిపాటి బిక్షపతి మాదిగ హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న MRPS, MSP నూతన మండల కమిటీల జాతీయ సదస్సును విజయవంతం చేయడంలో భాగంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బయ్యారం మండల అడక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీన పూర్తి స్థాయి మండల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.MSP మండల కన్వీనర్‌గా సంగపొంగు శ్రీనివాస్ మాదిగ, MRPS మండల కన్వీనర్‌గా కస్తాల నవీన్ మాదిగలను ప్రకటించారు. ఈ సందర్భంగా కస్తాల నవీన్ మాదిగ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మండల కన్వీనర్ బాధ్యతలు అప్పగించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగతో పాటు జిల్లా కమిటీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మండలంలో జాతి సమస్యలపై నిరంతరం పోరాడుతూ, జాతి అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని కస్తాల నవీన్ మాదిగ తెలిపారు.ఈ కార్యక్రమంలో బయ్యారం మండలం MRPS కో-కన్వీనర్ మంచాల నాగరాజు మాదిగతో పాటు కమిటీ సభ్యులు కతిప్పారపు మదన్ మాదిగ, పిడమర్తి నరేష్ మాదిగ, ఎర్ర బాబురావు, వడ్లమూడి బాబురావు, కాంపాటి రమేష్, దోసపాటి నరేష్, దగ్గుపాటి రాఘవేంద్ర, కలకొండ లక్ష్మయ్య, పందుల తేజ, పూలూరి సుధాకర్, పందుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

