అంతిమయాత్రలో భారీగా హాజరైన మండల సిపిఎం పార్టీ శ్రేణులు
తిరుమలాయపాలెం ఆగస్టు 15 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి గ్రామానికి చెందిన సిపిఎం మండల కమిటీ సభ్యులు బండారి సైదులు శనివారం రాత్రి 12 గంటలకు అకస్మాత్తుగా గుండెపోటు తో మృతి చెందడం జరిగింది యొక్క విషయం తెలుసుకున్న పార్టీ డివిజన్ కార్యదర్శి బండి రమేష్ మృతదేహాన్ని సందర్శించి మేడిదేపల్లి గ్రామంలో ఆదివారం జండా కప్పి నివాళి అర్పించడం జరిగింది . అనంతరం రమేష్ మాట్లాడుతూ సైదులు మృతి చెందటం పార్టీకి తీరని లోటు అని సైదులు పార్టీకి సేవలు మరువలేనివని పార్టీ మండల కమిటీ సభ్యుడిగా ఈ ప్రాంత ఉద్యమ విస్తరణ కోసం కృషి చేశాడని ఆయన చిన్నతనం నుంచి ఎత్తిన ఎర్రజెండా దించుకుంట చనిపోయేంతవరకు తన దేహం పై ఎర్రజెండాను కప్పుకొని పోయాడని ఆయన లేని లోటు పార్టీకి తీరని లోటు అని అన్నారు అనంతరం గ్రామంలో సైదులు అంతిమయాత్రలో పార్టీ శ్రేణులు మండల వ్యాప్తంగా కార్యకర్తలు తరలివచ్చి కడసారిగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను కొత్తపల్లి వెంకన్న అంగిరేకుల నరసయ్య పద్మనాభుల సుధాకరరావు వర్షపు వీరన్న కొలిచలం స్వామి బింగి రమేష్ తంగేళ్ల రమేష్ పల్లి రమేష్ నెరసుల వెంకటేష్ కామల్ల సునీల్ దొడ్డ లింగస్వామి రామనబోయిన రవి పిట్టల పాపారావు రావుల విజయ్ పాల్ రెడ్డి షేక్ ఫతేహమ్మద్ రావుల వెంకటరామిరెడ్డి మాచర్ల రాజశేఖర్ ఎర్ర పాపిరెడ్డి చిట్టెపరెడ్డి వెంకటరెడ్డి ప్రవీణ్ రెడ్డి పుల్లారెడ్డి మరల సత్తిరెడ్డి నరేష్ రెడ్డి ఉపేందర్ తిరుమల మోర ఉపేందర్ రెడ్డి నగేష్ దొండేటి నిర్మల్ రావు పుట్టల గురవయ్య తదితరులు పాల్గొన్నారు.


