
తిరుమలాయపాలెం ఆగస్టు 16 (నమస్తే న్యూస్ )
ఉత్తమ పోలీస్ ఆఫీసర్ అవార్డు ను తిరుమలాయపాలెం ఎస్ ఐ కూచిపూడి జగదీష్ శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతులమీదుగా అందుకు న్నారు. తిరుమలా యపాలెం మండలం, పిండిప్రోలు గ్రామంలో ఇటీవల వృద్దురాలి మర్డర్ కేసును చాకచక్యంగా వెలికి తీసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో ఉత్తమ పోలీస్ ఆఫీసర్ గా ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాతం త్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రశంస పత్రాన్ని అందిం చారు. ఈ సందర్భంగా ఎస్ ఐ జగదీష్ మాట్లాడు తూ ప్రభుత్వం తరఫున ఉత్తమ పోలీస్ అవార్డును అందుకోవడంతో నాపై మరింత బాధ్యత పెరిగిందని ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించుటలో తన కర్తవ్యాన్ని నెరవేరుస్తానని పేర్కొన్నారు. దీంతో కూసుమంచి సీఐ సంజీవ్ ఎస్సై రాజయ్య ఏ ఎస్ ఐ టి హరీష్ కానిస్టేబుల్ లో వీరస్వామి రామ్మూర్తి ఎల్.వి కిషన్ సునీత సౌజన్య హోంగార్డు ఉప్పలయ్య అభినందనలు తెలిపారు.
