రామన్నపేట ఆగస్ట్ 16 (నమస్తే న్యూస్)యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో నిర్వహించిన శ్రీ ఇంద్రపాల ముత్యాలమ్మ తల్లి ఊరేగింపు కార్యక్రమం సందర్భంగా నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు,అనంతరం దాతల సహకారంతో నిర్మించిన నూతన వసతి గృహాన్ని ప్రారంభించారు,ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆయన వెంట పాల్గొన్నవారు, ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్, సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి, ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మంటి లింగస్వామి, చిన్న పాక శ్రీనివాస్, బందెల రాములు, బోగారం సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్, బద్దుల రమేష్ యాదవ్, పోచబోయిన మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

