గిరిజన సంప్రదాయాలతో కోలాహలంగా వేడుకలు
తిరుమలాయపాలెం ఆగస్టు 16 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లోని సోలిపురం గ్రామం లో గ్రామ సర్పంచ్ నునావత్ సమ్మక్క అశోక్ ఆధ్వర్యంలో గిరిజన ఆరాధ్య దైవమైన తీజ్ ఉత్సవాలను గ్రామస్తులు గిరిజన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి తీజ్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.గ్రామంలో ప్రత్యేకంగా అలంకరించిన తీజ్‌ను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు, యువతులు పాటలు పాడుతూ డీజే చప్పులకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గ్రామంలో ఎటుచూసినా పండుగ వాతావరణం నెలకొంది.
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

