దంతాలపల్లి, ఆగస్టు 15 (నమస్తే న్యూస్):
దంతాలపల్లి మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసీల్దార్ సునీల్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో దంతాలపల్లి స్పెషల్ ఆఫీసర్, ఏడీఏ మురళి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.



