మహబూబాబాద్ , ఆగస్టు 15(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా శనివారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన జిల్లా సాగునీటి పారుదల కమిటీ, వ్యవసాయ సలహాలు సూచనల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, మున్సిపల్ చైర్మన్ గూగులోత్ జ్యోతి, హాజరయ్యారు. ఈ సందర్భంగా పంట మార్పిడి విధానంపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రతి ఒక్కరూ ఆరుతడి పంటలు వేయాలని, అదిగ లాభాలు ఉన్న వాణిజ్య పంటల వైపు మోగ్గు చూపే విధంగా రైతులకు ఆదర్శంగా ఉండాలని, ప్రతి ఒక్క రైతు అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలని, సూచించారు.కూరగాయల పంటలు, సాగు చేసే విధంగా చూడాలని అతిథులు తెలిపారు.మీడియా, ప్రతినిధులు బాధ్యతగా విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా కూడా రైతుల్లో చైతన్యం వస్తుందని కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు.



