తిరుమలాయపాలెం ఆగస్టు 15 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలం లోని దమ్మాయిగూడెం లోని సరస్వతి విద్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి విద్యాలయం ప్రిన్సిపాల్ గుగులోత్ శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు జాతీయ గీతం ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు.విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వక్తలు పిలుపునిచ్చారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

