ఒక నిర్లక్ష్యం ఖరీదు 21 నెలల చిన్నారి ప్రాణం బలి
రామన్నపేట ఆగస్ట్ 15(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో రామన్నపేట నాగార్జున ప్రైవేటు పాఠశాల బస్సు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పిల్లలని తరలించే సందర్భంలో, సుమారుగా ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు, గ్రామానికి చెందిన ఈర్లపల్లి మురళి తన పెద్ద కుమార్తె ఈర్ల పెళ్లి శ్రేష్టజ్ఞను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తండ్రి తీసుకురాగా అదే సమయంలో తండ్రి వెనకాల 21 నెలల చిన్నారి చిన్న కుమార్తె ఈర్ల పెళ్లి అభిజ్ఞతార బస్సు సమీపానికి వచ్చింది, అదే సమయంలో బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా బస్సును ముందుకు నడిపి చిన్నారి అభిజ్ఞతాలను బలిగొన్నాడు బస్సు పాపపైనుండి పోవడంతో తీవ్ర రక్తస్రావము కలిగి అక్కడికక్కడే మృతి చెందింది ఇట్టి విషయంపై మృతి చెందిన చిన్నారి తండ్రి వీర్లపల్లి మురళి ఫిర్యాదు మేరకు రామన్నపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు రామన్నపేట ఎస్సై సతీష్ గౌహతి ఒక ప్రకటనలో తెలిపారు, మృతికి కారణమైనవాహనాన్ని పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉంచడం జరిగింది.

