రామన్నపేట, ఆగస్టు 15 (నమస్తే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఇబ్రహీం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఇబ్రహీం మృతితో రామన్నపేటలోని పాత్రికేయ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, మీడియా మిత్రులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

