రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, ఆర్దిక దోపిడీకి వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో కార్పోరేట్, మతోన్మాద శక్తులకు అనుకూలంగా ఉంటున్న కేంద్ర బిజేపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుంట ఉపేందర్ కోరారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని సిపిఎం ఆఫీసులో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిపిఎం మండల కమిటీ జాతీయ పతాకాన్ని సీనియర్ నాయకులు మేరుగు వెంకన్న ఆవిష్కరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుంట ఉపేందర్, జిల్లా కమిటీ సభ్యులు మండా రాజన్న, మండల కార్యదర్శి నంబూరి మధు మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన 79 సంవత్సరాలు అనంతరం కూడా కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని, కనీస మద్దతు ధరలు లేక రైతాంగం అప్పుల ఊబీలో కూరకపోయారని, ధరల భారాలతో ప్రజానీకం సతమతమవుతున్నారని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో సంబంధం లేని బిజేపి పాలనలో దేశ సంపదను కార్పోరేట్ శక్తులకు అప్పనంగా అప్పగించడమే కాక మతోన్మాద చర్యలతో ప్రజల ఐక్యతను విడదీస్తున్నారని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. హక్కుల పరిరక్షణ కోసం, రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవటం కోసం స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తితో బిజేపి ప్రభుత్వంపై ఉద్యమించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు బి. వెంకటేశ్వర్లు, అంగిరేకుల నాగేశ్వరరావు, వల్లాల వెంకన్న, వెన్ను మోహన్, మంకేన తిరుపతిరావు, యస్ కే యాకూబ్, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు కత్తి రమేష్, వల్లాల కల్పన తదితరులు పాల్గొన్నారు.

