తిరుమలాయపాలెం ఆగస్టు 15 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లోని బీరోలు గ్రామపంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుమ్మడి దేవా బిక్షం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుమ్మడి దేవా బిక్షం జాతీయ జాతీయ పతాకానికి వందనం చేసి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి, గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని సర్పంచ్ గుమ్మడి దేవా బిక్షం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచి గుమ్మడి దేవా బిక్షం ఉప సర్పంచ్ పులిగుజ్జు మంగమ్మ గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.

